రుతుపవనాల కాలం రాకముందే పిల్లలందరికీ ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సినేషన్ ఇప్పించాలని నిపుణులు గట్టిగా చెబుతున్నారు.

Last Updated on

ఇన్‌ఫ్లూయెంజా, దాని నివారణ ప్రాముఖ్యత గురించి మరింత తెలుసుకోండి

పిల్లలందరికీ ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సినేషన్ చేయించాలని నిపుణులు చెబుతున్నట్లు మనం వార్తల్లో వింటూనే ఉన్నాం. ఫ్లూ, కొవిడ్-19లలో ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఫ్లూ షాట్ ఇప్పించడం ద్వారా పిల్లలకు కొవిడ్-19 భయం తగ్గి, తల్లిదండ్రులు వారిని కాపాడే అవకాశం ఉంటుంది.

‘ఇన్‌ఫ్లూయెంజా లేదా ఫ్లూ అంటే ఏమిటి?’ సాధారణ జలుబుకి వాటికి తేడా ఏంటి? వాటి పిల్లలను ఎందుకు రక్షించాలి? లాంటి ప్రశ్నలు చాలా మంది తల్లిదండ్రులు అడుగుతుంటారు.

వ్యాధి గురించి, దాని నివారణ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు.

పిల్లలు ఎప్పుడు చూసినా కారుతున్న ముక్కుతో, దగ్గుతో ఉండటం నేటి జీవితంలో ఒక భాగంగా మారింది. జ్వరం, ముక్కు దిబ్బడ, జలుబు లాంటి లక్షణాలు పెరిగినప్పుడు, వారిలో ఇన్‌ఫ్లూయెంజా తీవ్రస్థాయికి చేరుకుంటుంది. దాన్ని ఫ్లూ అని పిలుస్తారు.

ఇన్‌ఫ్లూయెంజా / ఫ్లూ అనేది ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది చిన్నారుల గాలిగొట్టాలు, ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించే, సంవత్సరంలో వచ్చే అత్యంత సాధారణ శ్వాససంబంధ వ్యాధుల్లో ఒకటి3. జాన్ హాప్కిన్స్ వారు నిర్వహించిన ఒక పరిశోధనలో చాలా మంది పిల్లలకు ఒక వారం రోజుల్లోనే తగ్గిపోయినా, కొందరిలో మాత్రం తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్ చికిత్స అవసరం రావొచ్చు. అంతేకాకుండా వారిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (న్యూమోనియా) రావచ్చు లేదా మరణానికి కూడా దారి తీయవచ్చు. కేవలం భారతదేశంలోనే ఇన్‌ఫ్లూయెంజా/ ఫ్లూ బారిన పడి 5 ఏళ్ల లోపు చిన్నారులు ప్రతి ఏడాది 1 లక్ష మంది హాస్పిటల్ పాలవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రమాదంలో ఉన్నది ఎవరు?

ఇన్‌ఫ్లూయెంజా/ ఫ్లూ ఎవరికైనా రావచ్చు. అయినప్పటికీ, ఈ వ్యాధి బారిన పడి అత్యధికంగా ప్రభావితమయ్యే వర్గాలు ప్రత్యేకంగా ఉన్నాయి. వీరిలో 6 నెలల నుండి 5 ఏళ్ల వయస్సు గల చిన్నారులు, గర్భవతులు, 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వృద్ధులు, ఆరోగ్యశాఖ వర్కర్లు, డయాబెటిస్, ఆస్తమా, కేన్సర్, ఇమ్యూనోసప్రెషన్ లాంటి వ్యాధులు గల వ్యక్తులు ఉన్నారు.

వ్యాప్తి/విస్తరణ

ఇన్‌ఫ్లూయెంజా/ ఫ్లూ ఉన్న వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు వెలువడిన తుంపరల కారణంగా ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి, వ్యాధిగ్రస్తునికి దగ్గరగా ఉన్నవారికి ఎక్కువగా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది. గాలిలో విడుదలైన ఈ తుంపరలు దాదాపు 6 అడుగుల దూరం వరకు ప్రసరించి, ఆ చుట్టుపక్కల ఉన్నవారికి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి5.

చిన్న పిల్లలు లేదా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇన్ఫెక్షన్ కలిగించే సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు చాలా కాలం పాటు ఇన్ఫెక్షన్ కలిగిస్తారు.

నివారణ

ఈ వ్యాధిని తగ్గించడానికి ఎన్నో యాంటీవైరల్ (యాంటీ ఇన్‌ఫ్లూయెంజా) డ్రగ్స్ ఉన్నప్పటికీ, వ్యాధి రాకుండా చూసుకోవడం ప్రధాన విషయం. కొన్ని సాధారణ, సమర్థవంతమైన నివారణ చర్యలు పాటించి ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఆపవచ్చు. అవి ఏమిటంటే6:

  1. దగ్గుతున్నప్పు/ తుమ్ముతున్నప్పుడు వారి నోరు, ముక్కుకు ఏదైనా అడ్డం పెట్టుకోవాలని పిల్లలకు నేర్పించడం
  2. తరచుగా, శుభ్రంగా చేతులను కడుక్కోవడం. నీళ్లు అందుబాటులో లేనప్పుడు శానిటైజర్ వేసుకున్నా కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది.
  3. ఇన్ఫెక్షన్ సోకిన వారికి దూరంగా ఉండటం, వారిని నేరుగా ముట్టుకోకపోవడం.
  4. పబ్లిక్ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం.
  5. వార్షిక ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సినేషన్.

వార్షిక ఇన్‌ఫ్లూయెంజా/ ఫ్లూ వ్యాక్సినేషన్ అనేది ఇన్‌ఫ్లూయెంజాతో పోరాడటానికి అత్యంత సమర్థవంతమైన దారుల్లో ఒకటి.

6 నెలల నుండి 5 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు అందరికీ తప్పనిసరిగా ఈ వార్షిక ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని అంతర్జాతీయ, భారతీయ ఆరోగ్య అధికారులు సిఫార్సులు చేస్తున్నారు.6 ఇన్‌ఫ్లూయెంజాను తట్టుకోవడానికి మనలో ఉన్న వ్యాధినిరోధక శక్తి కాలంతో పాటుగా తగ్గుతుందని అందరికీ తెలుసు, ప్రతి ఏడాది వైరస్ స్ట్రెయిన్ మారుతుంది, అందుకు తగ్గట్టుగానే వ్యాక్సిన్ కూడా మారుతుంది కాబట్టి ప్రతి ఏడాది వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి.6 ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్ వేయించడం వల్ల మీ చిన్నారిలో వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి కూడా తగ్గిపోతుంది.

వ్యాక్సినేషన్ ద్వారా ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి, దాని నివారణ గురించి మరింత సమాచారం కోసం మీ పీడియాట్రిషియన్‌ను సంప్రదించండి.

డిస్‌క్లెయిమర్: GlaxoSmithKline Pharmaceuticals Limited. Dr. Annie Besant Road, Worli, Mumbai 400 030, India ద్వారా జనహితార్థం జారీ చేయబడింది. ఈ మెటీరియల్‌లో ఉన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ మెటీరియల్‌లో ఉన్నది ఏదీ మెడికల్ సలహా కాదు. మెడికల్ సంబంధిత సందేహాలు ఏవైనా ఉన్నా, లేదా మీ పరిస్థితి గురించి ప్రశ్నలు ఉన్నా దయచేసి మీ ఫిజీషియన్‌ను సంప్రదించండి. వ్యాక్సిన్ ద్వారా నివారించ గల వ్యాధులు, ఒక్కో వ్యాధికి ఉన్న పూర్తి వ్యాక్సినేషన్ షెడ్యూల్ కోసం దయచేసి మీ పీడియాట్రిషియన్‌ను సంప్రదించండి. ఏదైనా GSK ఉత్పత్తి వల్ల కలిగిన ఇబ్బందిని india.pharmacovigilance@gsk.com వద్ద కంపెనీకి రిపోర్ట్ చేయండి.
CL code: NP-IN-FLT-OGM-210008, DoP Jun 2021

Was this article helpful?
thumbsupthumbsdown
    Latest Articles