మెంతులు ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు – Fenugreek Seeds (Methi) Benefits, Uses and Side Effects in Telugu

Written by
Last Updated on
✔ Evidence Based

thebridalbox believes in credibility and giving our readers access to authentic and evidence-based content. Our stringent editorial guidelines allow us to only cite from reputed research institutions, academic journals, and medically established studies. If you discover any discrepancy in our content, you may contact us.

మెంతులు తెలియని వారు ఉండరు. ప్రతీ వంటగదిలో తప్పకుండా ఉండే వస్తువు ఇది. మెంతి పొడిని పప్పుల్లో, పులుసుల్లో, పచ్చళ్లలో కలుపుతారు. అలాగే మెంతి కూర (ఆకు కూర) ను కూడా పప్పు, కూరలలో వాడుతూ ఉంటారు. మెంతులు పసుపు రంగులో ఉంటాయి. మంచి సువాసనను కలిగి ఉంటాయి. మెంతులను వేయించినప్పుడు ఇంకా చక్కని సువాసన వస్తుంది. అయితే మెంతులు చేదుగా ఉంటాయి. అందువల్ల వంటకాలలో తక్కువ మోతాదులో వాడతారు.

మెంతులను ఇంగ్లీష్ లో ‘ఫెన్యుగ్రీక్’ అనీ, హిందీలో ‘మేథీ’ అని, తమిళంలో ‘వెంద్యం’ అనీ, మలయాళంలో ‘ఉలువ’ అనీ, కన్నడంలో ‘మెంతే’ అనీ, పంజాబీలో ‘మెత్’ అనీ, మరాఠీలో ‘మేతి దానే’ అని మరియు బెంగాలీలో ‘మేథీ’ అనీ అంటారు.

మెంతులలో పీచు పదార్ధం సమృద్ధిగా వుంటుంది. మెంతి ఆకుల్లో ఇనుము ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. అంతేకాక యాంటీ యాక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

విషయ సూచిక

మెంతులలో ఔషధ గుణాలు

మెంతులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే తరతరాలుగా మెంతులను జుట్టు పెరగడానికి కండిషనర్ గా వాడుతున్నారు. కానీ క్రొత్తగా పరిశోధనల్లో అవి ఇంకా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయని తెలిసింది. వంటకాలకు సుగంధాన్నిచ్చే ఈ మెంతులు ఆరోగ్యానికీ, చర్మానికీ, జుట్టుకూ కూడా ఎన్నో విధాల సహాయపడతాయి.

మెంతుల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు – Health Benefits of Fenugreek Seeds in Telugu

ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటి జీర్ణ సమస్యలు, మధుమేహం, బాధాకరమైన రుతుస్రావం, మెనోపాజ్, పాలిసిస్టిక్ అండాశయం సిండ్రోమ్, ఆర్థరైటిస్, థైరాయిడ్ సమస్య, అధిక రక్తపోటు వంటి గుండెను ప్రభావితం చేసే పరిస్థితులపై కూడా ఉపయోగపడుతుంది. ఇవే కాక ఇవి జుట్టుకు, చర్మానికీ కూడా ఎంతో మేలు చేస్తాయి.

1. డయాబెటిస్ లేదా మధుమేహాన్ని అదుపు చేస్తాయి

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు తరచూ మెంతులను వాడమని సలహా ఇస్తారు ఎందుకంటే దీనిలో మధుమేహాన్ని నియంత్రణ చేసే శక్తి ఉంది. మెంతులకు టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించే గుణం ఉందని అధ్యయనాల్లో తేలింది (1).

2. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

మెంతులలో నారింజనీన్ అనే ఫ్లవనాయిడ్స్ ఉండటం వల్ల అది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది (2).

3. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది

మెంతులు గుండెలోని రక్తనాళాల పనితీరును మెరుగు పరుస్తుంది. గుండెపోటు రావడానికి ముఖ్యమైన కారణం గుండె కవాటాలు మూసుకుపోవడం. అయితే ఒకవేళ అప్పటికే కొంత హాని జరిగినా మెంతుల వల్ల ఇకపై గుండెకు హాని జరగకుండా కాపాడుతుంది (3).

4. ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులకు చక్కని ఔషధం

మెంతులలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఆర్థరైటిస్ తో బాధపడేవారికి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని పరిశోధనల్లో తేలింది (4). అందువల్ల మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం వల్ల ఆ నొప్పుల నుండి చాలా వరకు తేరుకుంటారు.

5. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులను తగ్గిస్తుంది

మెంతులు నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులు, నొప్పులు మరియు ఇతర ఇబ్బందులను తగ్గించడానికి సహకరిస్తాయి.

మెంతులలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మరియు నొప్పులను నివారించే గుణాల వల్ల నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులు, కడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి తగ్గుతాయని అధ్యయనాల్లో తేలింది (5). అంతే కాదు, మెంతుల పొడి తల నొప్పి, వికారం వంటి సమస్యలకు కూడా ఎంతో ఉపయోగకరం.

6. జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది

జీర్ణ సమస్యలతో బాధపడేవారికి మెంతులు ఒక వరం వంటివి.

మెంతులు గ్యాస్ట్రిక్ ఇబ్బందులకు, మల బద్ధకానికి,, కడుపులో వచ్చే అల్సర్లకు అద్భుతమైన మందు. దీనిలోని సహజమైన జీర్ణ శక్తిని పెంపొందించే అంశాలు జీర్ణాశయాన్నీ, ప్రేగుల పనితీరునూ మెరుగుపరుస్తాయి (6).

7. క్యాన్సర్ ను నివారిస్తుంది

మెంతులు కాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడడానికి ఎంతో ఉపయోగపడతాయని అధ్యయనాల్లో తేలింది . మెంతులలో యాంటీ కాన్సర్ గుణాలు ఉండటం వల్ల వీటిని తీసుకొనే వారిలో కాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే శక్తి పెంపొందుతుంది (7).

8. పాలిచ్చే తల్లులలో పాల సామర్ధ్యాన్నిపెంచుతాయి

మెంతులను పాలిచ్చే తల్లులలో పాల సామర్ధ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు.

ఈ మెంతులలో తల్లిపాల ఉత్పత్తికి కారణమయ్యే ఫైటోఈస్ట్రోజెన్ ఉండటం వల్ల పాలిచ్చే తల్లులలో ఇది పాల సామర్ధ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది (8). మెంతులతో చేసిన టీ ని త్రాగడం వల్ల ఈ ఉపయోగాన్ని పొందవచ్చు. అంతేకాక పసి పిల్లలు చక్కగా ఆరోగ్యంగా బరువు పెరగడానికి తోడ్పడుతుంది (8).

9. బరువు తగ్గించడానికి సహాయపడతాయి

Help reduce weight
Image: Shutterstock

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మెంతులను మీ డైట్ మెనూ లో తప్పక చేర్చండి. మీరు తినే ప్రతీ పదార్థంలోనూ మెంతులను లేదా మెంతిపొడిని చేర్చండి. దానివల్ల మీ మెటబాలిజం మెరుగుపడుతుంది.

అంతే కాక, మెంతులు శరీరంలో క్రొవ్వు పేరుకుపోకుండా చేసి, గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి, బరువు తగ్గడంలో సహాయపడతాయి (9).

10. రక్తపోటును క్రమపరుస్తాయి

మెంతులలోని పొటాషియం మరియు పీచు పదార్ధాలు రక్తపోటును క్రమపరచడంలో సహాయ పడతాయి.

మెంతులను ఉడకబెట్టి, పేస్ట్ చేసి ఆ పేస్ట్ ను రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులోనికి వస్తుంది.

11. మూత్రపిండాల (కిడ్నీల) పనితీరును మెరుగు పరుస్తుంది

మెంతులలో పాలిఫినోలిక్ ఫ్లావానాయిడ్స్ ఉంటాయి. ఇవి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి మరియు కణాల క్షీణతను నిరోధిస్తాయి, వాటి చుట్టూ ఒక రక్షణ పొరను ఏర్పరుస్తాయి (10).

12. కాలేయాన్ని కాపాడటానికి

కాలేయం మానవ శరీరంలోని విషపదార్ధాలను తొలగిస్తుంది. కాలేయం పాడయ్యిందంటే ఇంక అంతే, ఆయుష్షు సగం అయిపోయినట్లే. కాలేయం పాడవడానికి ముఖ్య కారణం మద్యపానం. మెంతులు మద్యపానం వల్ల వచ్చే నష్టాలను కూడా కొంత వరకు తగ్గించగలవు (11). మెంతులలో ఉండే పోలీఫెనోల్స్ వల్ల కాలేయం కాపాడబడుతుంది మరియు జీవక్రియ మెరుగుపడుతుంది.

మెంతులు కేవలం ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంపొందించడానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి.

మెంతుల వలన చర్మానికి కలిగే ప్రయోజనాలు – Skin Benefits of Fenugreek Seeds in Telugu

13. యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి

  • ఒక టేబుల్ స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టండి.
  • ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోండి.
  • మిక్సీలో రెండిటినీ కలిపి మెత్తని పేస్ట్ తయారు చేయండి.
  • ఆ పేస్ట్ ను మీ ముఖంపై ప్యాక్ లా వేసి 30 నిమిషాలు ఉంచి తర్వాత కడిగేయండి.

ఈ విధంగా తరచు చేయడం వల్ల ముఖంపై వచ్చే ముడతలు తగ్గుతాయి.

నానబెట్టిన మెంతులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి ముఖంపై వచ్చే ముడతలను తగ్గిస్తాయి (12). పెరుగులోని లాక్టిక్ ఆసిడ్ ముఖాన్ని మృదువుగా చేస్తుంది (13).

14. మొటిమలను తగ్గిస్తాయి

మెంతులు ప్రభావవంతంగా మొటిమలను తగ్గిస్తాయి. నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టి, నాలుగు కప్పుల నీటిలో 15 నిమిషాలు ఉడికించి చలార్చాలి. తర్వాత నీటిని వడకట్టి, ఆ నీటిలో దూదిని ముంచి ఆ నీటిని మొటిమలపై అద్దాలి. (మిగిలిన నీటిని రిఫ్రిజిరేటర్ లోనిల్వ ఉంచవచ్చు.)

ఇలా రోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.

మెంతులలో డైసోజెనిన్ అనే సమ్మేళనంఉంది. దానిలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి (14).

15. చర్మాన్ని తేమగా ఉంచుతాయి

మెంతులు పొడిగా ఉండే లక్షణాలను తగ్గించి చర్మాన్ని తేమగా ఉంచుతాయి .

ఒక టేబుల్ స్పూన్ మెంతులను టేబుల్ స్పూన్ నీటితో కలిపి ఒక పేస్ట్ తయారు చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను ముఖంపై పట్టించాలి.

ఇలా తరచూ చేస్తే మెంతులలోని జిగురుగా ఉండే పదార్ధం వల్ల ముఖం పొడిబారడం తగ్గి మృదువుగా అవుతుంది (15).

మెంతుల వలన జుట్టుకి కలిగే ప్రయోజనాలు – Hair Benefits of Fenugreek Seeds in Telugu

16. జుట్టు ఊడటాన్ని తగ్గిస్తాయి

మెంతులు మూలాల నుండి జుట్టును బలోపేతం చేస్తుంది. ఫొలిక్యులర్ సమస్యలకు చాలా సమర్థవంతంగా చికిత్స చేస్తుంది.

సీసాను తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులను, ఒక కప్పు కొబ్బరి నూనెలో కలిపి ఎండ తగలని ప్రదేశంలో మూడు వారాలపాటు ఉంచాలి. ఆ తర్వాత ఆ నూనెను తలపై మర్దనకు వాడాలి.

మెంతులలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే హార్మోన్ పూర్వగాములు ఉన్నాయి. వీటిలోని ప్రోటీన్ మరియు నికోటినిక్ ఆమ్లం జుట్టును బలోపేతం చేసి జుట్టు చిట్లడాన్ని నివారిస్తాయి (16).

17. జుట్టుకు మెరుపునిస్తాయి

మెంతులు జుట్టుకు మెరుపునిస్తాయి మరియు మృదువుగా చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల మెంతులను, ఒక కప్పు మరిగిన నీళ్లలో వేసి బాగా కలిపి రాత్రంతా నాననివ్వండి. గింజలు మెత్తబడ్డాకా ఆ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించి అరగంట అలానే వదిలేసి తర్వాత కడిగేయండి.

మెంతులలో లెసిథిన్ ఉంటుంది (17). నానబెట్టడం వల్ల మెంతులలో వచ్చే జిగురు పదార్ధం జుట్టును మృదువుగా పట్టులా మెసిసేలా చేస్తుంది.

18. చుండ్రును నివారిస్తాయి

జుట్టుకు వచ్చే సాధారణ సమస్య చుండ్రు. ఇది సాధారణంగా చలికాలంలో వస్తుంది. చుండ్రుపై ప్రభావవవంతంగా పనిచేసే సహజ ఔషధాల్లో మెంతులు ముఖ్యమైనవి. అవి పొడిబారిన మాడును బాగుచేస్తాయి మరియు చర్మసంబంధమైన ఇబ్బందులపై కూడా బాగా పని చేస్తాయి (18).

19. తల నెరవడాన్ని ఆలస్యం చేస్తాయి

మెంతులలో జుట్టు రంగును కోల్పోకుండా చేసే గుణాలు ఉన్నాయి. అందువల్ల వీటిని తరచుగా వాడటం వల్ల జుట్టు నెరవడం ఆలస్యమవుతుంది (19).

మెంతులను ఎలా ఉపయోగించాలి – How to Use Fenugreek Seeds in Telugu

  • మెంతులను రాత్రంతా నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగటం వల్ల ఎన్నో లాభాలున్నాయి.
  • మెంతులు నానబెట్టిన నీటితో జుట్టును తడిపి 10 నిమిషాలు వదిలేసి ఆపై కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది.
  • మెంతులను పొడిగా అన్ని ఆహార పదార్ధాలపైనా చల్లితే ఆ పదార్ధాలకు రుచిని ఇవ్వడమే కాక మెంతుల గుణాలు శరీరానికి అంది ఆరోగ్యం పెంపొందుతుంది.
  • మెంతులతో టీ కూడా చేసుకోవచ్చు.

మెంతుల వల్ల కలిగే ప్రయోజనాలు, ఉపయోగాలు తెలుసుకున్నాము. ఇప్పుడు వీటి వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.

మెంతులు వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Fenugreek Seeds in Telugu

  • మెంతులను గర్భిణీ స్త్రీలు తినడం అంత మంచిది కాదు దాని వల్ల ముందుగానే డెలివెరి అయ్యే ప్రమాదం ఉంది (20). డెలివరీకి ముందు మెంతులు తింటే శిశువు నుండి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.
  • మధుమేహానికి వాడే వారు డాక్టర్ సలహాతో మెంతులను తీసుకోవడం మంచిది.
  • కొంతమందికి మెంతుల ఎలర్జీ ఉంటుంది. వారు మెంతులను తీసుకోకపోవడమే మంచిది.

మెంతుల యొక్క పౌష్టిక విలువలు గురించి తెలుసుకుందాం.

మెంతుల యొక్క పౌష్టిక విలువలు – Fenugreek Seeds Nutritional Value in Telugu

100 గ్రా మెంతులలో ఉండే పౌష్టిక విలువలు
కెలోరీలు 323
మొత్తం క్రొవ్వు పదార్ధం 6 g9%
శ్యాచురేటెడ్ ఫ్యాట్ 1.5 g7%
కొలెస్ట్రాల్ 0 mg0%
సోడియం 67 mg2%
పొటాషియం 770 mg22%
మొత్తం పిండి పదార్ధాలు 58 g19%
పీచు పదార్ధాలు 25 g100%
Protein 23 g46%
విటమిన్ A1%Vitamin C5%
కాల్షియం17%Iron186%
విటమిన్ D0%Vitamin B-630%
కోబాలమిన్0%Magnesium47%

చదివారుగా మరి, మెంతుల యొక్క ఉపయోగాలు, వాడే విధానాలు, దుష్ప్రభావాలు తెలుసుకున్నారుగా? అయితే మరి అవసరమైన జాగ్రత్తలను తీసుకుంటూ మెంతులను మీ ఆహారంలో భాగంగా చేసుకొండి.

Was this article helpful?
thumbsupthumbsdown

Community Experiences

Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals. Let our readers get your unique perspectives and do better together! Read our Comment Policy to know about the guidelines.

Latest Articles