లవంగం ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు – Clove (lavangam) Benefits, Uses and Side Effects in Telugu
లవంగము అనేది ఒక చెట్టు మొగ్గ. లవంగం చెట్టు నుండి పూసిన పువ్వును ఎండబెట్టి దీనిని తయారు చేస్తారు. ఒక ప్రత్యేకమైన సుగంధద్రవ్యంగా ఇది అన్నిరకాల వంటకాల్లోనూ ఉపయోగించబడుతుంది. దీనిలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలూ, యాంటిబయోటిక్ గుణాలూ ఉన్నాయని మీకు తెలుసా? ఇంతే కాదు మీరు తెలుసుకోవలసినది ఇంకా చాలా ఉంది. చదవండి మరి…
లవంగాలు ఎందుకు మంచివి?
లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ C మరియు K ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. విటమిన్ C మరియు K రోగనిరోధకతను పెంచుతాయి మరియు రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతాయి. లవంగాలలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే, అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. ఇంతే కాదు, లవంగాల వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలున్నాయి.
లవంగం వలన కలుగు ప్రయోజనాలు – Benefits of Clove in Telugu
- దంతసమస్యలకు అద్భుత పరిష్కారం
- దగ్గు, జలుబులకు ఇవొక మంచి చిట్కా
- మధుమేహాన్ని నియంత్రిస్తాయి
- నొప్పులు, వాపులకు చక్కని నివారణ
- జీర్ణాశయ సమస్యలకు చక్కని పరిష్కారం
- రక్త ప్రసరణ మెరుగు పడేందుకు
- క్యాన్సర్ నివారణకు
- తలనొప్పులకు
- ఒత్తిడి తగ్గించడానికి
- టెస్టోస్టీరాన్ లెవెల్స్ ను పెంచడానికి
- వికారం వాంతులకు పరిష్కారంగా
- చెవి నొప్పికి
- మొటిమల సమస్యలకు
1. దంతసమస్యలకు అద్భుత పరిష్కారం
లవంగాలలోని యుజెనాల్ అనే పదార్ధం దంతసమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ పదార్థం యాంటీబాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండి, నొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది.
నోటిలో 2 లవంగాలు వేసుకొని వాటిని పళ్ళతో గట్టిగా నొక్కుతూ నమలాలి. దానివల్ల విడుదలైన నూనె నొప్పితో పోరాడుతుంది. ఒకవేళ అవి అయిపోతే మరొక లవంగంతో ఇదే పద్దతిని 30 నిమిషాల పాటు పునరావృతం చేయండి. నొప్పి తగ్గుతుంది.
పన్నునొప్పి చాలా ఎక్కువగా ఉంటే పళ్లతో లవంగాలను నొక్కడం చాలా కష్టం. అటువంటి సందర్భంలో లవంగాలను పొడిగా చేసి నొప్పి ఉన్న చోట ఉంచాలి. లేదంటే లవంగం నూనెను కూడా వాడవచ్చు.
ఒక ఇరానియన్ అధ్యయనం కూడా నొప్పి నివారణ కు లవంగం సహాయపడుతుందని తెలుపుతోంది (1). లవంగాలు నోటి దుర్వాసను కూడా తగ్గిస్తాయి.
2. దగ్గు, జలుబు, ఆస్తమానూ తగ్గించడానికి
లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, మరియు ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు మరియు దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాస నాళాన్ని హాయి పరుస్తుంది మరియు యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది.
- లవంగం నూనెను ఛాతిపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది.
- కొన్ని లవంగాలను కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీ లా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతీరోజూ ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి.
- ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
3. మధుమేహాన్ని నియంత్రిస్తాయి
క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని ఒక అధ్యయనం నివేదించింది. మరొక జంతు అధ్యయనంలో మధుమేహం గల ఎలుకలకు లవంగాల నూనెను ఇవ్వడం ద్వారా షుగర్ స్థాయిలు తగ్గాయని తెలిసింది (2).
ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరిసిన్ అనే మరొక సమ్మేళనం లవంగాలు ఉందని ఒక అధ్యనంలో తేలింది (3). అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు.
4. నొప్పులు వాపులకు, కీళ్ల నొప్పులకు చక్కని నివారణ
లవంగాలలోని యుజెనాల్ అనే పదార్ధానికి శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ఇవి లవంగం నూనెలోనూ, లవంగాల్లోనూ కూడా పుష్కలంగా ఉన్నాయి (4).
లవంగాలు నోటి పూత మరియు గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం చేసిన మరొక అధ్యయనంలో, రోజూ లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గటాన్ని గమనించారు. (5). ఈ సైటోకైన్లను తగ్గించడం వలన కీళ్ళనొప్పులు మరియు ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి.
5. జీర్ణాశయ సమస్యలకు చక్కని పరిష్కారం
లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కొన్ని పరిశోధన ప్రకారం, కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ యొక్క మందం పెంచుతుంది, ఇది కడుపు లైనింగ్ ను రక్షిస్తుంది మరియు సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది (6).
లవంగాలు లో ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది మరియు మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
6. రక్త ప్రసరణ మెరుగు పడేందుకు
కొన్ని పరిశోధనల ప్రకారం లవంగం నూనెకు ఈ శక్తి ఉందనేది నిజం. ఈ నూనె శరీరం యొక్క జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది మరియు రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. లవంగాలలోని యాంటీఆక్సిడెంట్ లక్షణములు రక్త శుద్ధి సహాయపడవచ్చు.
7. క్యాన్సర్ నివారణకు
ఒక అధ్యయనాన్ని బట్టి లవంగాలు మరణానికి కారణమయ్యే క్యాన్సర్ కణాలను నిరోధించడానికి సహాయపడతాయని నిరూపించబడింది (7). లవంగాలలోని యుజినాల్ అన్నవాహికలో వచ్చే క్యాన్సర్ ను నిరోధించగలదు (8).
లవంగాలలో పుష్కలంగా యాంటీఆక్సిడెండ్స్ ఉన్నాయి. యాంటీఆక్సిడెండ్స్ క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడతాయి. లవంగాలు రొమ్ము కాన్సర్ ను కూడా నిరోధించగలవని ఒక అధ్యయనంలో తేలింది (9).
8. తలనొప్పులకు
లవంగాలలోని నొప్పి తగ్గించే లక్షణాలు అద్భుతాలు చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా కొన్ని లవంగాలను నలిపి శుభ్రమైన రుమాలులో పెట్టి మూటకట్టండి. తలనొప్పి ఉన్నప్పుడు వాసన పీల్చండి. కొంత ఉపశమనం లభిస్తుంది.
ఒక టేబుల్ స్పూను కొబ్బరి నూనెకు, రెండు చుక్కల లవంగం నూనెను కలిపి నుదుటిపై మసాజ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.
9. ఒత్తిడి తగ్గించడానికి
కొన్ని దృష్టాంతాలు ద్వారా లవంగాలు ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయని తెలుస్తోంది.
10. టెస్టోస్టీరాన్ లెవెల్స్ ను పెంచడానికి
ఎలుకలపై చేసిన ఒక అధ్యయనంలో లవంగాలు టెస్టోస్టీరాన్ ను పెంచుతాయని తేలింది.
లవంగాలు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతుందని కొన్ని దృష్టాంతాలు ద్వారా తెలుస్తోంది.
11. వికారం వాంతులకు పరిష్కారంగా
ఏదైనా తిన్నది సరిగ్గా లేక వాంతులు వచ్చినప్పుడు కడుపు లో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనె ను తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
వికారం తగ్గడానికి లవంగంతో మరికొన్ని చిట్కాలు:
- క్లోవ్ టీ: ఒక టీస్పూన్ లవంగం పొడి, లేదా 6 లవంగాలను వేడి నీటిలో వేయండి. త్వరిత ఉపశమనం కోసం రోజులో 2 సార్లు దీన్ని తాగండి.
- లవంగాలు మరియు తేనే: ఒక టీస్పూన్ తేనెలో ఒక చిటికెడు లవంగాల పొడిని కలిపి తీసుకోండి. తేడా మీకే తెలుస్తుంది.
- లవంగం నూనెను వాసన చూడండి: గర్భిణులలో వచ్చే వికారానికి ఇది బాగా పని చేస్తుంది.
12. చెవి నొప్పికి
చెవి నొప్పిగా ఉందా? అయితే ఇదిగో మీ చిట్కా: 2 టీస్పూన్ల నువ్వుల నూనెను వేడి చేసి 2-3 చుక్కల లవంగం నూనెను వేయండి. ఈ నూనెను ఇప్పుడు నొప్పి ఉన్న చెవిలో వేయండి. నెమ్మదిగా నొప్పి తగ్గుతుంది.
13. మొటిమల సమస్యలకు
లవంగాలలోని యాంటీబాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. లవంగం నూనె మొటిమలను తగ్గించడానికి మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ బాగా పనిచేస్తుంది.
ఇవీ లవంగాల వల్ల కలిగే లాభాలు. మరి వీటిలోని పౌష్టిక విలువలను తెలుసుకుందాం.
లవంగం యొక్క పౌష్టిక విలువలు – Nutritional Value of Clove in Telugu
మూలకం | పౌష్టిక విలువ | ఆర్డిఏ % |
---|---|---|
ఎనర్జి | 47 Kcal | 2% |
పిండి పదార్ధాలు | 10.51 g | 8% |
ప్రోటీన్లు | 3.27 g | 6% |
క్రొవ్వులు | 0.15 g | 0.5% |
కొలెస్ట్రాల్ | 0 mg | 0% |
పీచు పదార్ధాలు | 5.4 g | 14% |
విటమిన్లు | ||
ఫోలేట్స్ | 68 µg | 17% |
నికసిన్ | 1.046 mg | 6.5% |
పాంథేర్నిక్ ఆసిడ్ | 0.338 mg | 7% |
పైరిడ్అక్సయిడ్ | 0.116 mg | 9% |
రైబోఫ్లవిన్ | 0.066 mg | 5% |
థయామిన్ | 0.072 mg | 6% |
విటమిన్ ఏ | 13 IU | 0.5% |
విటమిన్ సి | 11.7 mg | 20% |
విటమిన్ ఈ | 0.19 mg | 1% |
విటమిన్ కె | 14.8 µg | 12% |
ఎలక్ట్రోలైట్స్ | ||
సోడియం | 94 mg | 6% |
పొటిషియం | 370 mg | 8% |
మినరల్స్ | ||
క్యాల్షియం | 44 mg | 4% |
కాపర్ | 0.231 mg | 27% |
ఐరన్ | 1.28 mg | 16% |
మెగ్నీషియం | 60 mg | 15% |
మాంగనీస్ | 0.256 mg | 11% |
ఫాస్ఫరస్ | 90 mg | 13% |
సెలీనియం | 7.2 µg | 13% |
జింక్ | 2.32 mg | 21% |
లవంగాల వల్ల కలిగే మరికొన్ని ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
లవంగం వలన కలుగు మరికొన్నిఉపయోగాలు – Uses of Cloves in Telugu
- తేనె, కొంచెం లవంగాల నూనె ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
- లవంగాలు ఏ వంటకంలోనైనా వేసుకోవచ్చు. వంటకాలకు మంచి సువాసన రుచినీ కూడా ఇస్తుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది.
- తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది .
- లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనసైటిస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది.
- మనం ప్రతి రోజు తాగే టీ లో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది
- 10 లేక 12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు, చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి మంచిది.
- క్రమం తప్పకుండా ఆహారం లో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇన్ని విధాలుగా ఉపయోగపడే లవంగాల వలన ఏదైనా దుష్ప్రభావాలు కలవా అని తెలుసుకుందాం.
లవంగాల వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Clove in Telugu
- సరిగ్గా నిల్వ చేయని లవంగాలను తీసుకోవడం వల్ల వికారం, కాలేయంలో సమస్యల వంటివి కలిగే అవకాశం ఉంది.
- లవంగాల వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది.
- లవంగం నూనెను ముఖం పై మసాజ్ చేయడం వల్ల కొన్ని సార్లు దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
చివరిగా ఒక్క మాట
వంటల్లో ప్రధాన పాత్ర వహించే ఈ సుగంధ ద్రవ్యం యొక్క సుగుణాలు, ఉపయోగాలు, పౌష్టిక విలువలూ చూసారుగా? మీక్కూడా వాడాలనిపిస్తోందా? మరి వాడటం ఎప్పటినుండి మొదలు పెడుతున్నారు?
మరింత చదవండి:
Community Experiences
Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.