అలోవెరా (కలబంద) యొక్క 16 ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు – 16 Aloe Vera (Ghritkumari) Benefits, Uses And Side Effects In Telugu

Written by
Last Updated on

కలబంద కు సంవత్సరానికి 13 బిలియన్ డాలర్ల మార్కెట్‌ ఉంది (1). ఇక ఈ సంఖ్య పెరుగుతూనే ఉండొచ్చు.

కలబంద యొక్క ప్రయోజనాల గురించి తెలియజేసే అధ్యయనాలు వందలాది ఉన్నాయి. వాటిలో చాలావరకు నిరూపించబడ్డాయి, మరికొన్నింటిని ఇంకా అధ్యయనం చేస్తున్నారు.

ఈ మొక్కని వేలాది సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. భారతీయ, చైనీస్ వైద్యాలతో పాటు పాశ్చాత్య వైద్యంలో కూడా ఇది బాగా ప్రాచుర్యం పొందింది.

సౌందర్య ఉత్పత్తులలో దీని ఉపయోగం 1970 లలో ప్రారంభమైంది (2). కలబంద గుజ్జు/ అలోవెరా జెల్ చర్మ సమస్యలపై చక్కగా పనిచేస్తుంది. డయాబెటిస్ (మధుమేహం) మరియు బరువు తగ్గడంపై కలబంద చూపే ప్రభావాలపై పరిశోధన చాలా ఉంది. కలబంద యొక్క ప్రయోజనాలను వివరంగా చూద్దాం.

కలబంద ఎలా పని చేస్తుంది?

కలబంద ఒక చిన్న కాండం కలిగిన పొద. దీనిని తరచుగా ‘వండర్ ప్లాంట్’ అని పిలుస్తారు. దీనిలో 500 జాతులు ఉండగా, వీటిలో ఎక్కువ రకాలు ఉత్తర ఆఫ్రికాలో పెరుగుతాయి.

అలోవెరా చాలా కాలం నుండి సౌందర్య సాధనాలు, మూలికా నివారణలు మరియు ఆహార పదార్ధాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది.

కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు – Benefits Of Aloe Vera In Telugu

అలోవెరా అతిముఖ్యమైన 75 విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి డయాబెటిస్ (మధుమేహం) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స గా పనిచేస్తాయి. కలబంద మీ చర్మ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పెంచడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.

కలబంద వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు – Benefits Of Aloe Vera For Skin In Telugu

1. మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం కోసం కలబంద:

చర్మాన్ని తేమగా మరియు ఆరోగ్యంగా ఉంచే సహజ పదార్ధాలలో అలోవెరా ఉత్తమమమైనది. అధిక మొత్తంలో కలబంద ఉన్న కాస్మొటిక్స్ చర్మాన్ని మెరుగ్గా, ఎక్కువకాలం తేమగా ఉంచుతాయి (3).

పొడిబారిన చర్మాన్ని బాగు చేయడానికి కూడా కలబంద ఉపయోగపడుతుంది .

కలబందను మొటిమలు, మచ్చలు, స్ట్రెచ్ మార్క్స్ (చర్మపు చారలు) తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు (4).

కలబంద, చర్మంపై వచ్చే మంట, దురద మరియు కాలిన గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది (5). కలబంద వల్ల అలెర్జీలు రావడం చాలా అరుదు. అందుకే చాలా మంది చర్మ సమస్యల కోసం కలబందను సిఫార్సు చేస్తారు.

హెర్పెస్ మరియు సోరియాసిస్ యొక్క చికిత్సలలో కలబంద ప్రభావవంతంగా పనిచేస్తుంది (6). అయితే, దీనిపై మరింత శాస్త్రీయ పరిశోధన అవసరం. పాయిజన్ ఐవీ వల్ల కలిగే దురద మరియు మంటకు అలోవెరా ఉపశమనం కలుగచేస్తుంది (6).

అలోవెరా ఉన్న ఫార్ములా, మొటిమలకు చికిత్స చేయడంలో సాధారణ క్రీమ్ కంటే ప్రభావవంతంగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో కనుగొన్నారు. మొటిమలు ఉన్న 60 మందికి కలబంద క్రీమ్‌తో చికిత్స చేసినప్పుడు, మొటిమల తీవ్రత మరియు మచ్చలు బాగా తగ్గినట్లు గమనించారు (7).

కలబందలో చర్మాన్ని మృదువుగా చేసే లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ప్రత్యేకించి మొటిమల కోసం వాడే చాలా మాయిశ్చరైజర్లలో దీన్ని కలుపుతారు (8).

కలబందతో తయారు చేసిన ఉత్పత్తులు మంటలు, దురదలకు చికిత్స చేయడంలో మరింత ప్రభావవంతంగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కలబందను ఓసిమమ్ ఆయిల్‌తో కలుపుకుంటే అది మొటిమలపై మరింత సమర్ధవంతంగా పోరాడుతుంది(9).

మొటిమలపై కలబందను ఎలా ఉపయోగించవచ్చో చూడండి.

  1. రాత్రిపూట కలబందను నేరుగా మొటిమలపై రాసుకుని ఉదయం ముఖం కడుక్కోవాలి.
  2. కలబందను నిమ్మరసంతో కలపడం కూడా సహాయపడుతుంది.
  3. దీన్ని 8: 1 నిష్పత్తిలో చేయండి (కలబంద 8 భాగాలు నిమ్మరసం 1 భాగం).
  4. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోండి. కంటి ప్రాంతానికి, ముఖం యొక్క ఇతర సున్నితమైన భాగాలకు రాయకండి.
  5. దీన్ని 10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై మీ ముఖాన్ని నీటితో బాగా కడగండి.
  6. ముఖంపై ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది

కలబందను తరచుగా తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు తగ్గుతాయి (10). కలబందను ప్రతీ రోజు తీసుకున్న వారిలో మూడు నెలల తరువాత, మఖంపై ముడతలు తగ్గి చర్మం మృదువుగా మారింది.

కలబందలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే అసేమన్నన్ అనే సమ్మేళనం ఉంది (11). ఈ విధంగా, వృద్ధాప్యం యొక్క సంకేతాలను ఆలస్యం చేయడానికి కలబంద సహాయపడుతుంది.

2. ఎండా కాలంలో కమిలిన చర్మాన్ని మెరుగు పరచడానికి / సన్ ట్యాన్ నివారణకు:

ఎండలో తిరిగినప్పుడు చర్మం పై పొరల్లోని చర్మకణాల రంగు మారి చర్మం నల్లగా కమిలిపోయి మచ్చలు ఏర్పడతాయి. అంటే సూర్యకాంతిలోని అల్ట్రా వయోలెట్ (UV) కిరణాల వల్ల చర్మం రంగు మారడం అన్నమాట.

సన్ టాన్ నివారించడంలో కలబంద చక్కగా పని చేస్తుంది.

కలబంద గుజ్జును చర్మంపై రాసుకుని గుండ్రంగా మర్దనా (మసాజ్) చేయాలి.

అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గాయాలకు మందుగా పని చేస్తుంది

కలబంద యొక్క ప్రధాన ప్రయోజనాల్లో గాయాలను తగ్గించడం ఒకటి. ఫైబ్రోబ్లాస్ట్స్ (కొల్లాజెన్ ఉత్పత్తి చేసే కణాలు) విస్తరణను ప్రోత్సహించడం ద్వారా ఇది వైద్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది (12).

కలబంద గజ్జిని కూడా నయం చేస్తుంది. గజ్జి అనేది అంటువ్యాధి, చర్మ వ్యాధి. తీవ్రమైన దురద మరియు ఎర్రటి మచ్చలు దీని లక్షణాలు. గజ్జి చికిత్సలో కలబంద బెంజైల్ బెంజోయేట్ లాగా ప్రభావవంతంగా ఉంటుందని ఒక అధ్యయనంలో కనుగొన్నారు (13).

కలబంద రేడియేషన్ వల్ల ఏర్పడే చర్మపు ఇబ్బందులను నయం చేస్తుంది (14). అధిక-స్థాయి రేడియేషన్ చికిత్స పొందిన వారికి కలబంద ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది.

3. స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి సహాయపడుతుంది:

చాలా మంది ఆడవారు ప్రసవం అయిన తర్వాత చాలా రకాల సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. అందులో ఒకటి పొట్టపై కనపడే గీతలు/చారలు. అయితే, వీటిని తగ్గించడానికి కలబంద చాలా బాగా సహాయపడుతుంది.
కలబంద రసంలో వీట్‌ జెర్మ్‌, ఆలివ్‌ నూనె, కోకో బటర్‌ను కలిపి చారలపై రాయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడగాలి.

కలబంద వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు – Benefits Of Aloe Vera For Hair In Telugu

4. జుట్టు పొడవుగా పెరగడానికి:

కలబంద (ఆలోవెరా) అనేక జుట్టు సమస్యలతో సమర్థవంతంగా పోరాడుతుంది. అది కూడా ఎక్కువ ఖర్చు లేకుండానే! ఆలోవెరాలో 75 పోషక విలువలు ఉన్నాయి. అంతే కాక, ఈ మొక్కలో 100 కి పైగా సూక్ష్మపోషకాలున్నట్లు తేలింది. ఆలోవెరా మీ జుట్టుకి అసలు ఏం చేస్తుందని మీకు సందేహం రావచ్చు. ఆలోవెరాలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మాడుపై ఉండే పాడైన కణాలను బాగుచేస్తాయి. కుదుళ్ళ ఆరోగ్యాన్ని బాగుచేసి, త్వరగా జుట్టుపెరిగేలా చేస్తుంది. ఆలోవెరాను జుట్టుకి రాయటం వలన జుట్టు వెంటనే మృదువుగా,మెత్తగా మారుతుంది. మృదువైన జుట్టుతో హెయిర్ స్టైలింగ్ సులభమై, జుట్టును వదిలి ఉంచుకోవచ్చు! ఆలోవెరా లోని ఫంగల్ వ్యతిరేక లక్షణం చుండ్రును నివారిస్తుంది.

కొబ్బరినూనె, ఆలోవెరాను సమానంగా కలిపితే మీ మ్యాజిక్ ప్యాక్ తయారవుతుంది. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ను జుట్టుకి రాసుకుని నెమ్మదిగా మసాజ్ చేయండి. ముఖ్యంగా చివర్లలో ఎక్కువగా రాయండి. సరిగ్గా తల అంతా పట్టించి, ఒక గంట తర్వాత కడిగేయండి. ఈ అద్భుతమైన కండీషనింగ్ చిట్కా మీ జుట్టు తేమను కోల్పోకుండా చేసి కాపాడుతుంది.

5. చుండ్రును నివారిస్తుంది:

చుండ్రు సమస్యను నివారించడానికి అలోవెరా (కలబంద) చాలా బాగా పనిచేస్తుంది. కలబందలో ఉండే పెక్టిన్ తలలో కొత్త కణాలను మరియు కణజాలాలను ఉత్తత్తి చేయడానికి, జుట్టును శుభ్రంగా మరియు మెత్తగా చేయడానికి గొప్పగా సహాయపడుతుంది. తలలో చనిపోయిన కణాలను (డెడ్ స్కిన్ సెల్స్) తొలగించడం వల్ల కొత్త జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

6. హెయిర్ కండీషనర్ గా పని చేస్తుంది

hair growth
Image: Shutterstock

అలోవెరా ఒక నేచురల్ హెయిర్ కండీషనర్. ఇది హాని కలిగించే రసాయనిక హెయిర్ కండీషనర్స్ కంటే చాలా మంచిది. కాబట్టి అలొవెరా జెల్ ను మీ మాడుకు, జుట్టుకు బాగా పట్టించి, మర్దన చేసి తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

కలబంద వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు – Health Benefits Of Aloe Vera In Telugu

7. ఊబకాయం తగ్గించడానికి సహాయపడుతుంది:

ఊబకాయం ఉన్న ఎలుకలలో, ఎండిన కలబంద గుజ్జు పొడిని వాడటం వల్ల కొవ్వు తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పొడి ఎలుకలలో ఎక్కువ శక్తిని ఖర్చు చేయడం వల్ల ఈ ఫలితం వచ్చింది. కలబందను ఆహారంలో చేర్చడం ఊబకాయం తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఈ అధ్యయనంలో తేలింది (15).

కలబంద మానవ శరీరంలో ఆహారం వల్ల వచ్చే ఊబకాయం తెచ్చే నష్టాలను కూడా తగ్గించింది (16). మరీ ముఖ్యంగా, కలబంద గుజ్జు పొడి సబ్కటానియస్ మరియు విసెరల్ కొవ్వు బరువును గణనీయంగా తగ్గించింది (17).

ఆసక్తికరంగా, కొన్ని అధ్యయనాలలో స్థూలకాయంపై కలబంద చూపే ప్రభావాల గురించి మాత్రమే కాకుండా, తద్వారా వచ్చే ఇతర ఫలితాల గురించి కూడా తెలిసింది (18).

8. మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది:

ప్రేగులకి సంబందించిన సమస్యలలో అజీర్తి ఒకటి. కలబంద దాని లక్షణాలను తగ్గించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక నివేదికలో, కలబంద వాడకం ప్రేగులలో ఇబ్బంది ఉన్న వ్యక్తులలో నొప్పి మరియు అసౌకర్యాన్ని తగ్గించిందని తెలిసింది(19).

కలబంద మలబద్దకంతో బాధపడుతున్న వారిలో నొప్పిని తగ్గిస్తుందని ఈ నివేదిక పేర్కొంది.

కలబంద పాలను సాధారణంగా విరోచనాలకు మందుగా ఉపయోగిస్తారు. దీనికి కారణం కలబంద పాలు ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్లను కలిగి ఉండడం. కలబంద కలిగిన మందులతో చికిత్స చేసినప్పుడు దీర్ఘకాలిక మలబద్దకం ఉన్నవారికలో ఎంతో మెరుగుదల కనిపించింది (20).

9. డయాబెటిస్ పై ప్రభావం చూపుతుంది :

కలబంద వాడకంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించవచ్చు (21). కలబంద తరచుగా తీసుకున్న వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 46.6 mg / dL తగ్గాయి.

గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలపై కూడా కలబంద ప్రభావం చూపింది.

కలబందను ఉపయోగించిన వారిలో 4 వారాలలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని మారడమే కాక, వారి అసాధారణ లిపిడ్ ప్రొఫైల్స్ కూడా తగ్గాయి (22). ప్రీడయాబయాటిస్ ఉన్న వ్యక్తులలో కూడా ఇలాంటి ప్రభావాలను గమనించారు. ఈ మొక్కలో గ్లూకోమన్నన్, హైడ్రోఫిలిక్ ఫైబర్ మరియు ఫైటోస్టెరాల్ ఉన్నాయి, ఇవి ఈ ప్రభావాలకు కారణమవుతాయి.

ఆసక్తికరంగా, అలోవెరా జెల్ మాత్రమే కాకుండా కలబంద ఆకుల గుజ్జు కూడా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు (23).

డయాబెటిస్ చికిత్స కోసం కలబందను ఉపయోగించడం చాలా సులభం. మీరు రోజుకు రెండుసార్లు ఒక టీస్పూన్ కలబంద రసం తీసుకోవచ్చు. ఇది ఇన్సులిన్ ప్రవాహాన్ని క్రమబద్ధీకరిస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

అలోవెరా కణాలలోని మాక్రోఫేజ్‌ పనితీరును మెరుగుపరుస్తుంది, ఇవి రోగనిరోధక వ్యవస్థ యొక్క ముఖ్యమైన భాగాలు (24).

10. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది:

జీర్ణక్రియ సరిగా లేకపోవడం చాలా రకాల రుగ్మతలకి కారణం అవుతుంది. కలబంద జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.

కలబందతో GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి) లక్షణాలకు కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చికిత్స చేయవచ్చు. దీని ప్రభావాలు ఒమెప్రజోల్ మరియు రానిటిడిన్ కంటే మెరుగైనవిగా గుర్తించబడ్డాయి, ఈ రెండు మందులు తరచుగా GERD కి సూచించబడతాయి (25).

ఈ మొక్క మీ జీర్ణశయాంతర ప్రేగులను ‘గ్యాస్ట్రిక్ యాసిడ్ యాంటీ-సెక్రటరీ యాక్టివిటీ’ యొక్క చెడు ప్రభావాల నుండి రక్షిస్తుంది.

11. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది:

ఈ మొక్క గ్లూకోజ్, కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ సీరం స్థాయిలపై ప్రభావం చూపుతుంది. రక్తంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి: ఒకటి మంచిది, మరొకటి చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ రక్తములో ఉండే చెడు కొలెస్ట్రాలను (LDL) కాలేయానికి చెరవేసి, ఆపైన శరీరం నుండి బయటకు పంపించేందుకు సహాయపడుతుంది. అందుకే దీనిని “మంచిదని” అందరూ అంటారు. కానీ ఈ లిపోప్రొటీన్ అధికంగా ఉండటం మీ ఆరోగ్యానికి మంచిదికాదు. ఎందుకంటే, కొంత మందికి జన్యుపరమైన సమస్యలు ఉండటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు ఉండవచ్చు. దీనిని సమతుల్యంగా ఉంచుకోవడంలో కలబంద మీకు సహాయపడుతుంది. కలబంద కొలెస్ట్రాల్ పై చాలా ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది రెండు రకాల లిపోప్రోటీన్ల మధ్య తగిన సమతౌల్యాన్ని ఉంచుతుంది.

జ్ఞాపక శక్తిని పెంపొందించి మెదడును చురుకుగా ఉంచుతుంది

ఈ విషయంలో పరిశోధన చాలా తక్కువ, కానీ ఒక నివేదిక ప్రకారం, కలబంద పొడితో కూడిన తయారీ అల్జీమర్స్ ఉన్నవారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది (26).

కలబంద పొడితో తయారు చేసిన ఆహార పదార్ధం తిన్న అల్జీమర్స్ వ్యాధితో బాధపడే 34 మంది పెద్దవారిలో రోగనిరోధక శక్తి మరియు జ్ఞాపకశక్తి మెరుగుపడింది.

12. గుండె జబ్బులకు:

కలబందలోని ఉన్న అనేక అమైనో ఆమ్లాలలో ఆర్జినైన్ ఒకటి. నిజానికి, ఇది మీ గుండెకు చాలా ముఖ్యమైనది. ఆర్జినైన్ అనేది ఒక రకంగా అత్యవసరమైన అమైనో ఆమ్లం అయినప్పటికీ దీనిని మన శరీరం తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. వీటిని వేరుశెనగ, వాల్నట్స్ (అక్రోట్లను), మరియు కలబందలో కూడా పొందవచ్చు. మీరు బయట లభించే ఆర్జినైన్ ఒక మోస్తరుగా తీసుకున్నట్లయితే అది: గుండె, శరీరానికి రక్తం మంచిగా ప్రసరించేలా చేస్తుంది. సరైన రక్త ప్రసరణ మెటాబొలిక్ రేటును పెంచి శరీరంలో వ్యర్థ్యాలను తొలగిస్తుంది.

13. దురద, మంటలను తగ్గిస్తుంది:

కొన్ని అధ్యయనాలలో, కలబంద దురద మరియు మంటలపై చక్కటి ప్రభావాన్ని చూపిందని తెలిసింది. 40 మంది వాలంటీర్లతో కూడిన ఒక అధ్యయనంలో, హైడ్రోకార్టిసోన్ క్రీమ్ (27). కంటే అలోవెరా జెల్ మంట మరియు దురదతో పోరాడటంలో మంచి ప్రభావాన్ని చూపింది.

మరొక అధ్యయనంలో, కలబంద రసం ఎలుకలలో ఎడెమాను (అంగాలలో ఎక్కడయినా నీరు చేరే ఉబ్బు వ్యాధి) తగ్గించింది. కలబంద మంటను కూడా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపించాయి (27).

14. కీళ్లనొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులకు:

అలోవెరాలోని లక్షణాలు ఆస్టియో ఆర్థరైటిస్ (ముసలితనంలో వచ్చే కీళ్ళ వ్యాధి) చికిత్సలో కూడా సహాయపడతాయి (28). కలబంద NSAIDS జీర్ణశయంలోని చికాకులను కూడా నివారిస్తుంది. ఆర్థరైటిస్ వంటి సందర్భాల్లో నొప్పి నివారణకు నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు సూచించబడతాయి. కలబంద మొక్కను వాపు మరియు ఎర్రబడిన కీళ్ళపై పూయడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది.

15. దంత సంరక్షణకు:

కలబంద చిగుళ్ళలో రక్తస్రావం మరియు వాపును తగ్గిస్తుంది. ఇది నోటిని శుభ్రపరిచేటప్పుడు చేరుకోవడానికి కష్టంగా ఉండే ప్రాంతాల్లో కూడా శక్తివంతమైన మందుగా పనిచేస్తుంది. నోటి పగుళ్లు లేదా విడిపోయిన మూలలకు చికిత్స చేయడానికి కూడా పనిచేస్తుంది .

రియడోంటైటిస్ నోటికి వచ్చే ఒక ఇన్ఫ్లమేటరీ వ్యాధి. కలబంద తీసుకోవడం వల్ల ఈ వ్యాధి సంబంధిత లక్షణాలు తగ్గుతాయి (29).

అలోవెరా క్లోర్‌హెక్సిడైన్ తో సమాన ప్రభావాన్ని చూపించడం వల్ల దీన్ని సాధారణంగా మౌత్ వాష్‌లలో ఉపయోగిస్తారు (30).

కలబంద గల ఒక టూత్ జెల్ కావిటీస్ (దంతాలలో ఏర్పడే రంధ్రాలు) కలిగించే బ్యాక్టీరియాను నియంత్రించడంలో టూత్‌పేస్ట్ కంటే కూడా చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది (31).

సున్నితమైన దంతాలు లేదా చిగుళ్ళు ఉన్నవారికి కలబంద ఉత్తమ ప్రత్యామ్నాయం. టూత్‌పేస్టులలో ఉండే కఠినమైన రాపిడి కలబందలో లేదు (32). కలబందలో గల యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దంత సంరక్షణలో చక్కని పాత్ర వహిస్తాయి.

16. దగ్గు, జలుబు, మరియు గొంతు నొప్పులకు:

కలబంద గుజ్జు దగ్గు, జలుబు, మరియు గొంతు నొప్పులను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. దీనిలో గల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దగ్గు, గొంతు నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి. కలబంద గుజ్జును తీసుకుని కొద్దిగా తేనె కలపండి. ఎందుకంటే కలబంద చాలా చేదుగా ఉంటుంది. రెండిటినీ కలిపి తినండి. ఇది దగ్గు జలుబులకు చక్కని ఇంటి చిట్కా.

కలబంద రసం ఎలా తాగాలి – How To Drink Aloe Vera Juice In Telugu

How To Drink Aloe Vera Juice In Telugu
Image: Shutterstock

కలబందను అనేక ఆహార పదార్ధాలతో కలిపి వాడవచ్చు.

కలబంద ఆకులను స్నాక్స్ గా తినవచ్చు.

అలోవెరా జెల్ ను తాగవచ్చు కూడా .

టమోటాలు, కొత్తిమీర, నిమ్మ రసం, ఉప్పు, వెల్లుల్లి వంటి ఇతర పదార్ధాలతో అలోవెరా జెల్ క్యూబ్స్‌ను కలిపి బ్లెండర్‌లో రుబ్బండి. దీన్ని చిప్స్‌తో తినవచ్చు.

కలబంద ఆకులను సలాడ్‌లో చేర్చడం వల్ల అద్భుతాలు కూడా జరుగుతాయి ( జెల్ కూడా వేయచ్చు).

కలబంద జ్యూస్ కూడా మీరు ఇష్టపడవచ్చు. కలబంద ఆకు, ఏదైనా పండ్ల రసం ఒక కప్పు తీసుకోండి. ఆకు నుంచి గుజ్జును బయటకు తీయండి ( ఈ జెల్ ను భద్రపరుచుకోవచ్చు. భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి రెఫ్రిజిరేట్ చేసుకోవచ్చు). రెండు టేబుల్ స్పూన్ల జెల్ ను పండ్ల రసంలో వేసి కలిపి సర్వ్ చేయండి.

కలబందను వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects Of Aloe Vera In Telugu

క్యాన్సర్ ప్రమాదాన్నిపెంచవచ్చు:

కొన్ని అధ్యయనాలు డీకోలోరైజ్డ్ కలబంద గుజ్జును తీసుకోవడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని చూపిస్తాయి (33). ఈ అధ్యయనాలు ఎలుకలపై నిర్వహించినప్పటికీ, ఫలితాలు ఆందోళన కలిగించేవి. అందువల్ల, క్యాన్సర్ చికిత్సకు అనుబంధంగా కలబంద యొక్క ఏదైనా రూపాన్ని ఉపయోగించే ముందు దయచేసి మీ వైద్యులని సంప్రదించండి.

గర్భధారణ సమయంలో, పాలిచ్చే తల్లులకు హానికరం:

గర్భధారణ సమయంలో కలబందను తీసుకోవడం బిడ్డపై విష ప్రభావాలను కలిగిస్తుంది (34). సురక్షితంగా ఉండండి. ఆయా సమయాల్లో వాడకండి.

అలెర్జీలకు కారణం కావచ్చు:

కలబంద తీసుకోవడం వల్ల కొంతమంది వ్యక్తులలో కడుపు నొప్పి, వికారం, వాంతులు, మరియు దద్దుర్లు వస్తాయి. మీరు ఈ లక్షణాలలో దేనినైనా గమనించినట్లయితే, దయచేసి వాడకుండా ఉండండి (35).

హైపోకలేమియాకు కారణం కావచ్చు:

కలబంద తీసుకోవడం పొటాషియం స్థాయిలు చాలా తక్కువగా ఉండటానికి కారణం కావచ్చు. ఇది మూర్ఛలు మరియు ఎలక్ట్రోలైట్ అసాధారణతలకు దారితీస్తుంది. కీమోథెరపీ సమయంలో ఈ ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయి. దీని వెనుక ఉన్న కారణం గురించి ఇంకా సరైన సమాచారం లేదు.

కాలేయానికి హానికరం కావచ్చు:

కలబంద వాడకం వల్ల కాలేయానికి హాని కలుగవచ్చు. మీకు కాలేయ సమస్యలు ఉంటే, దయచేసి కలబందనుతీసుకోకండి. మీ వైద్యులని సంప్రదించండి.

వ్యతిరేక సూచనల గురించి జాగ్రత్తగా ఉండండి. వాటిని చదివి, అవేవీ లేకపోతే గనుక, మీరు కలబందను ఎటువంటి భయాలు లేకుండా ఉపయోగించవచ్చు. పూర్తి ప్రయోజనాలను పొందుతారు.

కలబంద మీ రోజువారీ దినచర్యకు ఎటువంటి అద్భుతమైన బూస్టర్ గా ఉంటుందో చెప్పడానికి ఇవి సరిపోవూ?

మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే కలబందను వాడటం మొదలు పెడుతున్నారా? మీ అనుభవాలను క్రింద కామెంట్ చేయడం ద్వారా మాకు తెలియజేయండి.

Was this article helpful?
thumbsupthumbsdown

Community Experiences

Join the conversation and become a part of our vibrant community! Share your stories, experiences, and insights to connect with like-minded individuals.

Latest Articles