దాల్చిన చెక్క ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు – Cinnamon (Dalchini) Benefits, Uses, and Side Effects in Telugu

Written by
Last Updated on

దాల్చిన చెక్క ప్రాచీన కాలం నుండి గల ఒక సుగంధ ద్రవ్యం. దాల్చిన చెక్క చెట్ల నుండి తీసిన బెరడును ఎండబెట్టి, కట్టలా చుడతారు. అదే మనకు దొరికే దాల్చిన చెక్క. ఇవి చక్కని సుగంధాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా మనం వంటకాలలో ఉపయోగిస్తాము. అయితే మనకు తెలియని మరో విషయం ఏమిటంటే ఈ దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే కాక సౌందర్యాన్ని కూడా పెంపొందింపజేస్తుంది. దాల్చిన చెక్క వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు వున్నాయి.

దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీనిలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ దీని అతి ముఖ్యమైన లక్షణం. దాల్చిన చెక్కతో ఉండే 41 సమ్మేళనాల వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని అధ్యయనాల్లో నిరూపితమైంది (1). మీరు కూడా ఆ ప్రయోజనాలన్నిటినీ పొందాలనుకుంటున్నారా? అయితే దీన్ని తప్పక చదవాలి.

విషయ సూచిక

దాల్చిన చెక్క తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు – Health Benefits of Cinnamon in Telugu

దాల్చిన చెక్క వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు వున్నాయి. దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.అంతేగాకుండా గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. దీన్ని వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు, చుండ్రు తగ్గుతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. దాల్చిన‌చెక్క‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. రకర‌కాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు దాల్చిన చెక్క‌లో ఉన్నాయి. దీన్ని ఆహారంలో తీసుకోవడం ద్వారా ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ‌వుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

1. బరువు తగ్గాలనుకుంటున్నవారికి

దాల్చినచెక్క అధిక కొవ్వు కలిగి ఉండే ఆహారం వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. దాల్చిన చెక్క కొవ్వు నిల్వ ప్రక్రియలో పాల్గొనే అణువుల ను తగ్గించడం ద్వారా మీ శరీరం లో కొవ్వు అణువుల సంఖ్యను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరి దీన్ని ఎలా వాడాలా అనుకుంటున్నారా? అయితే చదవండి.

గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు.

ఒక చెంచా తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క మిశ్రమాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలో పెరిగే కొవ్వు తగ్గుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారు ఖాళీ కడుపు అనగా అల్పాహారానికి ముందు మరియు రాత్రి పడుకోవడానికి ముందు దీన్ని తాగాలి.

2. ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చక్కని ఉపశమనం

దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల అది కీళ్ళ నొప్పులు కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. దాల్చిన చెక్కతో తయారు చేసిన నూనెను మర్దన చేయడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

3. మధుమేహం రోగులకు అద్భుత ఔషధం

మధుమేహం ఉన్న వారికి దాల్చిన చెక్క ఎంత‌గానో మేలు చేస్తుంది. నిత్యం ఒక స్పూన్ దాల్చిన చెక్క‌ పొడిని తీసుకుంటుంటే మధుమేహం తగ్గుతుంది. దీనివల్ల రక్తంలో ఉండే చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. ఇన్సులిన్ నిరోధకత తగ్గించే గుణాలు కలిగి ఉన్నందున టైప్ 2 మాత్ర‌మే కాదు, టైప్ 1 మధుమేహం ఉన్న వారికి కూడా ఇది మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే సమ్మేళనాలు అలనిన్ అనే ఎంజైమ్ ను శరీరంలో బ్లాక్ చేస్తుంది. ఇది ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ ను గ్రహించకుండా చేస్తుంది. అందుకే దాల్చిన చెక్క ద్రావణం మధుమేహం పేషంట్స్ కు చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా తగ్గిస్తుంది. అలాగే టైప్ 2 మధుమేహం ను తగ్గించి పరిస్థితిని మెరుగుపరిచి, ఇన్సులిన్ సెన్సిటివిటిని శరీరంలో మెరుగుపరుస్తుంది.

టైం పత్రిక ఒక వ్యాసం ఒక పరిశోధనా అధ్యయనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం టైపు 2 డయాబెటిస్ ఉన్నవారు దాల్చిన చెక్కతో కూడిన మందులు వాడడం వల్ల వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ లో చెప్పుకోదగిన మార్పులు కనిపిస్తున్నాయట (2).

4. మెదడుకు రక్షణ కల్పిస్తుంది

చాలా వరకూ మెదడుకు సంబంధించిన వ్యాధులు ఫ్రీరాడికల్స్ కారణంగానే వస్తాయి. ఇవి క్యాన్సర్ లేదా మతిమరుపు, పార్కిన్సన్ మరియు మెదడుకు సంబంధించిన ఇతర వ్యాధులకు కారణం అవుతాయి. దాల్చిన చెక్క మెదడుకు రక్షణ కల్పిస్తుంది. క్యాన్సర్ నివారించి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ శరీరంలో తిరగకుండా అడ్డుకుంటాయి.

5.జలుబు దగ్గులను సమర్ధవంతంగా తగ్గిస్తుంది

దాల్చిన చెక్కలో పాలిఫినాల్స్ అన‌బ‌డే ప్ర‌త్యేక‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.

6. రక్తప్రసరణ మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తుంది

దాల్చిన చెక్కలో ఎక్కువగా యాంటీబాక్టీరియల్ గుణాలు ఉన్నందున రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది.

7. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుంది మరియు గుండె జబ్బుల నుండి కాపాడుతుం, దీర్గాయువును ఇస్తుంది

దాల్చినచెక్క వల్ల మరొక ప్రయోజనం అధిక రక్తపోటును తగ్గించడం. ప్రతీ రోజూ దాల్చిన చెక్కను ఆహారంలో చేర్చడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని అధ్యయనాల వల్ల తెలుస్తోంది. దాల్చినచెక్క చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని స్థిరీకరింస్తుంది, తద్వారా గుండెపోటును నిరోధిస్తుంది. ప్రత్యేకంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు ఇది వర్తిస్తుంది (3).

8. నోటి దుర్వాసనకు, దంత సమస్యలను తగ్గించడానికి ఇది చక్కని చిట్కా

This is a nice tip to reduce oral stomach and dental problems
Image: Shutterstock

దాల్చిన చెక్కలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దంత సమస్యలను, చిగుళ్ళ వ్యాదులను, నోటి పుండ్లను నివారించడంలో గొప్ప పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా దాల్చిన చెక్క నోటి దుర్వాసనను నివారించడంలో సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది (4). అందుకే దీన్ని మౌత్ ఫ్రెషనర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాల్చిన నూనె నోటిలోని బాక్టీరియాను నిరోధించి నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.

 • ఈ ప్రయోజనాన్ని పొందటానికి చిన్న దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకొని నమిలితే చాలు. చాలా సేపు నోటి దుర్వాసనను దూరం చేయ వచ్చు.
 • రెండు చుక్కల దాల్చిన నూనెను ఒక అర కప్పు గోరువెచ్చని నీటిలో వేసి పుక్కిలిస్తే దంత సమస్యలు, ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.

9. అధిక రక్తపోటును అదుపు చేయడానికి ఉపయోగపడుతుంది

అధిక రక్తపోటు భారతదేశంలో అత్యంత సాధారణ వ్యాధులలో ఒకటి. దాల్చిన చెక్క రక్తపోటు తగ్గించగలదని జంతువులపై చేసిన అనేక అధ్యయనాలు కూడా నిరూపించాయి. అధిక రక్తపోటు గుండె జబ్బులకు దారి తీయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం రక్తపోటును నియంత్రించడానికి ఉత్తమ మార్గాలుగా పరిగణించబడతాయి. అంతేకాకుండా, దాల్చినచెక్కను మీ ఆహారంలో చేర్చడం వల్ల అధిక రక్తపోటును అదుపు చేయ వచ్చు. చాలా సులభంగా లభించే ఈ సుగంధద్రవ్యం సిస్టాలిక్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. యు ఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన అధ్యయనాన్ని బట్టి, దాల్చినచెక్క తినటం సిస్టాలిక్ రక్తపోటు 5.39 మిమీ తగ్గించడంలో సహాయపడింది.

10. ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తుంది

దాల్చిన చెక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరచడంలో క్రింది విధంగా సహాయపడుతుంది

పురుషులలో

చైనీయుల వైద్య విధానాలను బట్టి దాల్చినచెక్క తీసుకోవడం వల్ల మగవారిలో పురుషాంగంలో రక్త ప్రసరణ మెరుగు పడి వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది.

స్త్రీలలో

మహిళలలో పిసిఒస్ (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వంధ్యత్వానికి అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి. ఈ సమస్య ఉన్నవారికి అండాశయాలలో తిత్తులు పెరిగి సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గి ఋతు క్రమం సక్రమంగా రాదు.

ఈ సమస్య కలవారు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్, పిసిఒఎస్, బరువు తగ్గి ఋతుచక్రం క్రమబద్ధీకరించబడి మహిళల్లో సంతానోత్పత్తి సామర్ధ్యం పెరుగుతుంది.

వాడే విధానం

 • దాల్చిన చెక్క పొడిని ఆహార పదార్ధాలపై చల్లవచ్చు.
 • దాల్చిన చెక్క తో చేసిన టీ ని త్రాగవచ్చు.
 • ఒక మసాలా లా కూడా అన్ని ఆహార పదార్ధాలలోనూ వాడవచ్చు.

11. ఋతుక్రమ సమస్యలకు

దాల్చిన చెక్కలో అత్యధికంగా ఫ్లావనాయిడ్స్ మరియు ఇతర యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులు (మెన్స్ట్రువల్ క్రామ్ప్స్) ను తగ్గిస్తుంది.

12. గర్భవతులకు

గర్భవతులు కూడా కొద్ది మోతాదులో దాల్చిన చెక్కను తీసుకోవచ్చు. గర్భిణులలో అధిక రక్తపోటు సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. అయితే గర్భిణులు కేవలం డాక్టరు సలహా మేరకు మాత్రమే దీనిని తీసుకోవడం మంచిది.

13. మలబద్దకాన్నీ, గ్యాస్ సమస్యలనూ తగ్గించి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది

దాల్చినచెక్కలోని నూనెలు శక్తివంతమైన యాంటీమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల దీన్ని జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలకు చికిత్సగా వాడతార. దాల్చిన చెక్క యొక్క యాంటీఫంగల్ లక్షణాలు కూడా జీర్ణాశయంలో కాండిడా పెరుగుదలను నిరోధిస్తుంది (5). పచ్చి దాల్చిన చెక్కని తినటం వల్ల కడుపులోని గ్యాస్ తగ్గుతుంది.

14. విరేచనాలను అరికడుతుంది

విరేచనాలతో బాధపడేవారు దాల్చిన చెక్కతో చేసిన టీ త్రాగితే బాక్టీరియా చనిపోయి, అజీర్ణం తగ్గి, ఆరోగ్యం బాగుపడుతుంది.

15. నొప్పులను తగ్గించడంలో తోడ్పడుతుంది

దాల్చిన చెక్క యొక్క యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు వేర్వేరు రకాల వాపును తగ్గించటానికి సహాయపడతాయి (6). అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో రెండు టీస్పూన్ల తేనె కలిపి తీసుకోవడం వల్ల కండరాల వాపులు, కండరాల నొప్పులు, అలర్జీలు తగ్గుతాయి.

16. కాన్సర్ ను నిరోధిస్తుంది

దాల్చిన చెక్కలోని సినామల్డీహైడ్ అనే పదార్ధం శరీరంలో క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు ఏర్పడుటకు సహాయపడుతుంది. ముఖ్యంగా దాల్చిన చెక్క కోలన్ క్యాన్సర్ ను తగ్గించడంలో బాగా సహాయపడుతుందని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు.

ఇది ఎర్ర రక్తకణములలోని ఎంజైమ్లను ప్రేరేపిస్తుంది మరియు ఇది క్యాన్సర్ విస్తరణను నివారిస్తుంది (7).

ఒక అధ్యయనంలో, తర్వాత మెలనోమా క్యాన్సర్లో కణాల వాల్యూమ్ తగ్గింది.

దాల్చిన చెక్క వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు – Skin Benefits of Cinnamon in Telugu

వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియ, ఫంగస్, వైరస్, మరియు ప్యారాసైట్స్ ను శరీరం నుండి తొలగించడానికి దాల్చిన చెక్క ఒక ప్రభావవంతమైన ఏజెంట్ గా పనిచేస్తుంది. అందుకే చాలా రకాల నూనెల్లో దాల్చిన చెక్క ఎక్స్ ట్రాక్ట్ ను కలుపుతున్నారు. అలాగే ఫేస్ మాస్క్, స్క్రబ్, మొటిమల నివారణకు, చర్మ వ్యాధులకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాల్చిన చెక్క చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని మృదువుగా, తేమగా, అందంగా మార్చుతుంది. చర్మం లోపలి కణాల రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీబయోటిక్ మరియు యాంటీమైక్రోబియల్ ప్రభావాలు ఉండడం వల్ల చర్మాన్ని దద్దుర్లు, అలర్జీలు మరియు అంటురోగాల నుండి కాపాడడానికి సహాయపడుతుంది.

17. మొటిమలు లేదా యాక్నేను తగ్గిస్తుంది

దాల్చిన చెక్క మొటిమలను సమర్ధవంతంగా తగ్గిస్తుంది. దీనిలోని యాంటీబాక్టీరియల్ గుణాలు మొటిమలను కలిగించే బాక్టీరియా ను తగ్గిస్తాయి.

మీరు చేయాల్సిందల్లా ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి పట్టించడమే! మూడు టేబుల్ స్పూన్ల తేనెలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి బాగా గిలక్కొట్టి ముఖానికి పట్టించాలి. ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేయాలి. తర్వాత నీటితో కడగాలి.

18. పెదవులకు

మీకు నిండైన గులాబీ పెదవులు కావాలా? అయితే ముందుగా మీ పెదవులపై వేజలీన్ పెట్రోలియం జెల్లీ రాయండి. దానిపై దాల్చిన చెక్క పొడిని అద్దండి. కొద్దిగా జిల జిలమంటుంది. తర్వాత మళ్ళీ కొద్దిగా వేజలైన్ రాయండి. అంతే – ఎర్రని నిండైన పెదాలు మీ సొంతం!

19. పొడి చర్మాన్ని మృదువుగా చేసి చర్మంపై గల ముడతలను తగ్గిస్తుంది, చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా చేస్తుంది

ముఖం పై ఉండే ముడతలు తగ్గడానికి దాల్చిన చెక్క నూనెను రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీతో కలిపి ముఖానికి పట్టించాలి. దీనివల్ల ముఖంపై ఉండే ముడతలు తగ్గి ముఖం మృదువుగా మారుతుంది.

20. చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది

చర్మం పై వచ్చే తామర, ఎగ్జిమా వంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా దాల్చిన చెక్క, తేనె ల మిశ్రమం అద్భుతంగా పని చేస్తుంది.

దాల్చిన చెక్క వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాలు – Hair Benefits of Cinnamon in Telugu

దాల్చిన చెక్క వల్ల జుట్టు చక్కగా పెరుగుతుంది, తెల్లజుట్టు తగ్గడానికి ఉపయోగపడుతుంది. తలను శుభ్రపరచడానికి కూడా ఉపయోగకరమే. నిజానికి పెద్దగా అధ్యయనాలు లేనప్పటికీ కొందరు దాల్చిన చెక్క జుట్టు పెరుగుదలకు ఉపయోగ పడుతుందంటారు. దాల్చిన చెక్క మిశ్రమాన్ని జుట్టుకు పట్టించడం వల్ల ఈ లాభాన్ని పొందగలుగుతారు.

ఈ మిశ్రమం తయారు చేయడానికి అరకప్పు ఆలివ్ నూనె తీసుకొని వేడి చేయాలి. అది గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ నుండి తీసివేయాలి. ఇప్పుడు నూనెను ఒక గిన్నెలో వేసి దానిలో దాల్చిన చెక్క పొడి మరియు తేనె వేసి బాగా కలపాలి. తర్వాత బ్రష్ సహాయంతో దాన్ని కుదుళ్ళ నుండి జుట్టుకు పట్టించాలి. ఇలా తరచుగా చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది, ఊడటం తగ్గుతుంది.

ఇన్ని విధాలుగా ఉపయోగపడే దాల్చిన చెక్క వాడడం వలన దుష్ప్రభావాలు ఉన్నాయా?

దాల్చిన చెక్క వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Cinnamon in Telugu

 • అతి సర్వత్రా వర్జయేత్ అనేది అందరికీ తెలిసినదే. అంటే దేనిలోనైనా కూడా అతి పనికిరాదు. అది దాల్చిన చెక్కకు కూడా వర్తిస్తుంది. అతిగా దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల నోటి పూత, కాలేయం పని తీరు మారడం, స్కిన్ రాషెస్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది.
 • దాల్చిన చెక్క పొడిని దేనితోనూ కలపకుండా నేరుగా పూతగా రాయడం మంచిది కాదు. దీనివల్ల చర్మంపై రాషెస్ వచ్చే అవకాశం ఉంది.
 • గర్భిణులు దాల్చిన చెక్కను ఎక్కువగా తీసుకోవడం సమయం కంటే ముందే డెలివరీ అయిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల తర్వాత బాధ పడే కంటే ముందే తగ్గించడం మంచిది.
 • కొంత మందికి సిన్నమోన్ ఎలర్జీ ఉంటుంది. అటువంటివారు చర్మంపై ప్యాక్ వేసేటప్పుడు ముందుగా కొద్దిగా టెస్ట్ చేయడం మంచిది లేదంటే రాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది.
 • దీనిలో రక్తపోటు తగ్గించే గుణం ఉన్నందున బిపి మందులు వాడేవారు దీన్ని తక్కువగా తీసుకోవడం మంచిది. లేదంటే బిపి అతిగా తగ్గి అనారోగ్యం పాలయ్యే ప్రమాదముంది.

మరి ఇన్ని ఉపయోగాలున్న దాల్చిన చెక్క లోని పౌష్ఠిక విలువలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే చూడండి.

దాల్చిన చెక్క లోని పౌష్టిక విలువలు – Cinnamon Nutritional Value in Telugu

యు.ఎస్. డిపార్టుమెంటు అఫ్ అగ్రికల్చర్ ప్రకారం, ఒక టీ స్పూన్ దాల్చినచెక్క పొడిలోని పౌష్టిక విలువలు ఈ విధంగా ఉన్నాయి (8):

 • కేలరీలు: 6
 • ప్రోటీన్: 0 గ్రా
 • కార్బోహైడ్రేట్లు: 2 గ్రా
 • పీచు పదార్ధం: 1 గ్రా (4 శాతం DV)
 • మొత్తం చక్కెరలు: 0 గ్రా
 • మొత్తం కొవ్వు: 0 గ్రా
 • కొలెస్ట్రాల్: 0 మి.గ్రా
 • సోడియం: 0 మి.గ్రా
 • కాల్షియం: 26 మి.గ్రా (2.6 శాతం DV)
 • పొటాషియం: 11 మి.గ్రా (0.23 శాతం DV)
 • మెగ్నీషియం: 2 మి.గ్రా (0.5 శాతం DV)
 • భాస్వరం: 2 మి.గ్రా (0.2 శాతం DV)
 • విటమిన్ K: 1 మైక్రోగ్రామ్ (1.22 శాతం DV)
 • విటమిన్ ఎ: 8 అంతర్జాతీయ యూనిట్లు (0.16 శాతం DV)

చివరిగా

మరి తెలుసుకున్నారుగా దాల్చిన చెక్క గురించి. చూసారుగా ఎన్ని ఉపయోగాలున్నవో! ఇంత వరకు మీరనుకుంటున్నట్లు దాల్చిన చెక్క కేవలం ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు అని తెలిసిందిగా? మరెందుకాలస్యం? దీన్ని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి మరి!

మరింత చదవండి:

Was this article helpful?
thumbsupthumbsdown
  Latest Articles